బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం మృతదేహం

-

బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం మృతదేహం కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం మృతదేహం బయట పడింది. నిన్న ఉదయమే కారులో డ్రైవర్ను తీసుకెళ్లిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు… అర్ధరాత్రి యాక్సిడెంట్ అయిందని డ్రైవర్ తమ్ముడికి సమాచారం ఇచ్చాడు.

తెల్లవారుజామున రెండు గంటలకు డ్రైవర్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి… తన కారులోనే మృతదేహాన్ని తీసుకు వచ్చాడు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు. ఇక మృత దేహాన్ని కింద కుదించాలని తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎమ్మెల్సీ. అయితే… అసలు ఏం జరిగిందని ఆరా తీసిన తల్లిదండ్రులకు సమాధానం చెప్పకుండా వేరే కారులో పరారయ్యాడు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు. తల్లిదండ్రులు పనిచేస్తున్న అపార్ట్మెంట్ ఎదుట ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహాన్ని ప్రస్తుతం ఉంచారు. కాగా.. ఐదేళ్లుగా ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ వద్ద డ్రైవర్ గా సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version