విమానంగా మారిన కారు.. క్షణాల్లో గాల్లోకి.. వైరల్ వీడియో..!

సాధారణంగా అయితే గాల్లోకి ఎగిరే కార్లను మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. అప్పటి వరకు రోడ్డు మీద వెళ్తున్న కార్లు క్షణాల వ్యవధిలో విమానాలు గా మారిపోయి గాల్లోకి ఎగరడం లాంటివి ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో అలాంటి కార్లు ఉంటాయా అంటే దాదాపుగా అందరూ ఉండవు అనే సమాధానం చెబుతారు. కానీ ఈ కార్ చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరూ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.

ఏకంగా భూమ్మీద వేగంగా దూసుకుపోవడమే కాదు నిమిషాల వ్యవధిలో విమానం గా మారిపోయి గాల్లోకి ఎగిరే కారు ను ఆవిష్కరించారు ఇటీవలె ఐరోపాలోని స్లోవేకియా దేశం కి చెందిన ఓ సంస్థ. క్లెయిన్ విజన్ అనే సంస్థ గాల్లోకి ఎగిరే కారు తయారు చేసింది. దాదాపు ఈ కారును తయారు చేయడానికి 30 సంవత్సరాల పాటు కష్టపడి నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఈ కారు విమానం గా మారి గాలిలోకి ఎగురుతుంది అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.https://youtu.be/QAnIjwwzupI