రామ్ గోపాల్ వర్మ కి షాక్.. వ్యూహం కి సర్టిఫికెట్ నిరాకరించిన సెన్సార్ బోర్డు

-

క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం. దివంగతనేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా వ్యూహం సినిమాను తెరకెక్కించారు వర్మ. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీసుకొస్తున్నారు. వ్యూహం, శపథం. వ్యూహం నవంబర్ 10న ప్రేక్సకుల ముందుకు రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తాజాగా ఈ సినిమాను సెన్సార్ కోసం పంపించారు మూవీ మేకర్స్. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. కారణం ఏంటంటే.. సినిమాలో తీసుకున్న కంటెంట్ ప్రస్తుతం జరుగుతున్న అంశాలతో కూడుకున్నది కావడం. చిత్రంలోని పాత్రలకు నిజజీవిత పేర్లు పెట్టడంపై బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ కారణంగా వ్యూహం మూవీకి సెన్సార్ సర్టిపికెట్ ఇవ్వడానికి నిరాకరించింది సెన్సార్ బోర్డు. సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై వ్యూహం మేకర్స్ స్పందించారు. ఈ అంశంపై ఇప్పటికే రీవైజింగ్ అప్లై చేశామని వివరించారు. మరీ రివైజింగ్ అప్లికేషన్ రిప్లై ఎలా ఉండనుంది. వ్యూహం అనుకున్న డేట్ కి థియేటర్స్ లోకి వస్తుందా..? లేక ఓటీటీ డైరెక్ట్ గా రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version