సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మొత్తం జనాల్లోనే ఉండేవారు. ప్రతి చిన్న దానికి స్పందిస్తూ జనానికి అందుబాటులోనే ఉండేవారు. అయితే సీఎం అయ్యాక ఆయన బయట కనిపించడం దాదాపు మానేశారు. ఎంతసేపు ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లోనే ఉండేవారు. దీంతో అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయినా ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ప్రగతి భవన్ నుంచే పాలన నడిపించేవారు. ఎలాంటి పరామర్శలకు గానీ, పరిశీలనలకు గానీ వెళ్లేవారు కాదు.
కానీ ఎప్పుడైతే ఈటలను బర్తరఫ్ చేశారో అప్పటి నుంచి ఆయనలో కొంత మార్పు కనిపిస్తోంది. ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయడం, సీఎంగా తొలిసారి గాంధీకి వెళ్లడం, కరోనాపై నిత్యం సమీక్షలు నిర్వహించడం చూస్తుంటే.. మళ్లీ ప్రజల్లో పేరును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాల గ్రాఫ్ ను తగ్గించి, మల్లీ కేసీఆర్ గ్రాఫ్‌ను పెంచుకోవాలని చూస్తున్నారు. మరి ముందు ఇంకెన్నిచేస్తారో చూడాలి.