ఏపీకి కేంద్రం మరో శుభవార్త : మరో జాతీయ రహదారి మంజూరు

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. కోన సీమ కు మరో జాతీయ రహదారి మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. అమలాపురం నుంచి రావుల పాలెం వరకూ 16 జాతీయ రహదారికి అనుసంధానం గా 216 A హైవే ఏర్పాటు పై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. హైవే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు రోడ్డు మరియు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

ఇక ఇప్పటికే కత్తిపూడి – పామర్రు 216 జాతీయ రహదారి కోనసీమ మీదుగా విస్తరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం…. తాజాగా కోన సీమ కు మరో జాతీయ రహదారి మంజూరు చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్కార్‌ హర్షం వ్యక్తం చేసింది. కాగా.. మంజూరైన అమలాపురం నుంచి రావుల పాలెం రోడ్డు తో రవాణా ఇంకా సులభతరం కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version