ఆ విషయంలో మెగస్టార్ ను ఫాలో అవుతున్న పవర్ స్టార్

పవర్ స్టార్ మెగస్టార్ ను ఫాలో అవుతున్నాడు.బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ కు హై ప్రయారిటీ ఇస్తున్నాడు.ఇన్ టైమ్ కు సినిమా కంప్లీట్ చేయాలంటే కొన్ని తప్పవనే అండర్ స్టాండ్ కు వచ్చేశాడు.ఇప్పటివరకు కెరియర్లో అంతగా చేయని ఎక్స్ పరిమెంట్ ను ఇకనుంచి చేయాలని స్ట్ర్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు.ఇంతకీ పవన్ చేస్తున్న బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ ఏ ఫిలిం కోసం అనుకుంటున్నారా…


పవర్ స్టార్ సెకండ్ ఇన్నింగ్స్ మాములుగా లేదు.పొలిటికల్ మూమెంట్ తో కెరియర్ కు గ్యాప్ ఇచ్చిన ఈ స్టార్ హీరో..ఇప్పుడు వరుస సినిమాలతో ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయాడు.ఈ ప్రాసెస్ లో ఇన్ టైమ్ కు సినిమాలు షూట్ చేయాలని ఒకవైపు అనుకున్న అజెండా ప్రకారం పొలిటికల్ స్టెప్ లే వేయాలని మరోవైపు చూస్తున్నాడు.ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. ఎప్పుడో అయిపోవల్సిన వకీల్ సాబ్ పవన్ బిజీ షెడ్యూల్ తో వాయిదా పడుతూ వస్తుంది.తాజాగా ఇస్తున్న కాల్పీట్స్ తో షూట్ లు స్పీడ్ అందుకున్నాయి.

వకీల్ సాబ్ మేజర్ షూట్ అయిపోయింది.ఇక ఎటొచ్చి మిగిలింది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రమే.అవి షూట్ చేయాలంటే పవన్ స్లిమ్ గా మారిపోవల్సి ఉంది.ఇప్పుడున్న టైమ్లో ఈ ఫ్యాటీ బాయ్ స్లిమ్ గా మారడం అంత వీజీకాదు.దీనికి తోడు ఈ నెల మూడోవారంలో జరిగే షూట్ కు పవన్ రెఢీ అవ్వాల్సి ఉంది.ఆలోపు స్లిమ్ మారడం కోసం లిక్విడ్ డైట్ ను ఆశ్రయించాడు.గతంలో ఇన్ టైమ్ టార్గెట్ గా పెట్టుకున్నవారిలో రానా సోడియం డైట్ ను ఆశ్రయించి కాస్త హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాడనే టాక్ ఉంది.దీంతో సోడియం డైట్ జోలికి పోకుండా లిక్విడ్ డైట్ ను ఫాలో అవ్వడం బెటరనే అభిప్రాయానికి పవన్ వచ్చినట్లు తెలుస్తుంది.

లిక్విడ్ డైట్ లో డ్రింకింగ్ కాలరీస్ తీసుకుంటారు.అలాగే ఈ డైట్లో మూంగ్ దాల్ వాటర్ ను తీసుకునే ఛాన్స్ ఉంది.ఓ కోర్స్ ప్రకారం నిపుణుల సమక్షంలో పవన్ లిక్విడ్ డైట్ ను మెయిన్ టైన్ చేస్తున్నాడు.పవన్ గతంలో పంజా సినిమాకు కాస్త బబ్లీ లుక్ ట్రై చేశాడు.ఎంతో న్యూ లుక్ తో ఉన్నాడనే ప్రశంసలు దక్కాయి.ఈ లుక్ కోసం ప్రత్యేకించి డైట్ లాంటివి మెయిన్ టైన్ చేయకుండానే ఈజీగానే ఈ ఫీట్ సాధించాడు.మరి ఇప్పుడు స్లిమ్ గా మారడం ఫ్యాటీ బాయ్ గా మారినంత ఈజీకాదు కాబట్టి ..ఇక్కడ తన అన్న చిరంజీవి ఆచార్యకు కష్టపడినట్లు కష్టపడాల్సి ఉంది.ఈనెల మూడవ వారంలోనే షెడ్యూల్ కావడంతో ఆలోతపు ఎంత తగ్గితే అంత గొప్ప అన్నట్లుగా ఉంది వ్యవహారం.