అలియా భట్, రణబీర్ కపూర్ జంటకు కాండోమ్ కంపెనీ శుభాకాంక్షలు!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ త్వరలోనే తల్లి కాబోతుందన్న విషయం తెలిసిందే. ఆలియా భట్ ఈ శుభవార్త ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఆలియా భట్ రెండు నెలల క్రితమే ఏప్రిల్లో తన ప్రియుడు, బాలీవుడ్ స్టార్ హీరో రణ్భీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. వీరిద్దరూ తమ మ్యారేజ్ లైఫ్ ని అన్యోన్యంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలిసి నటిస్తున్నారు. కాగా అలియా భట్, రణబీర్ కపూర్ జంటకు ప్రముఖ కంపెనీ శుభాకాంక్షలు తెలియజేసింది.

ఆలియా తాను గర్భం దాల్చినట్లు ప్రకటించిన నేపథ్యంలో కండోమ్ కంపెనీ డ్యూరెక్స్ సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతూ..’ మెహ్ ఫీల్ మే తేరీ.. హమ్ తో క్లియర్లీ నహీథీ( మీ మొహం మధ్యలో మేము అడ్డుగా లేము)ద జోమో ఈజ్ రియల్.. కంగ్రాట్స్ ఆలియా, రణబీర్ అని పోస్ట్ చేసింది. దీంతో నెటిజెన్స్ దీనిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. మొత్తంమీద డ్యూరెక్స్ కండోమ్ సంస్థ తెలివైన మార్కెటింగ్ తో నెటిజన్లను ఆకట్టుకుంటుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news