ఎన్టీఆర్ విగ్రహానికి ఏ రంగు లైనా వేసుకోవచ్చు – కొడాలి నాని

-

ఎన్టీఆర్ కు , టీడీపీకి సంబంధం లేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాసిన విషయం వాస్తవం కాదా?? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ నుంచి పార్టీ గుర్తును లాక్కుని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని… ఎన్టీఆర్ ఏం పార్టీ వ్యక్తి కాదు… ప్రజా నాయకుడు అని పేర్కొన్నారు. బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టింది నేనేనని.. టీడీపీ వాళ్ళే నా పేరు తీసేసే ప్రయత్నం చేశారని ఆగ్రహించారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు…ఎన్టీఆర్ విగ్రహానికి ఏ రంగు లైనా వేసుకోవచ్చని స్పష్టం చేశారు. చంద్రబాబు వస్తాడు వెళతాడు.. నా చిన్నప్పటి నుంచి గుడివాడ లో నన్ను ఓడిస్తానని చంద్రబాబు సవాళ్లు విసురుతూనే ఉన్నాడని ఆగ్రహించారు మాజీ మంత్రి కొడాలి నాని. నన్ను ఓడించినా, గెలిపించినా గుడివాడ నియోజకవర్గ ప్రజలే చేయగలరని.. సొంత కొడుకునే గెలిపించ లేని అసమర్థుడు చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. తాను పుట్టిన సొంత నియోజకవర్గంలోనే పార్టీని గెలిపించలేని పనికి మాలిన నాయకుడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news