కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. కాసేపటి క్రితమే..తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తరుణంలోనే… తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తాజాగా నియామకం కాగానే.. తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత.. తీన్మార్ మల్లన్న ఎలాంటి వ్యాఖ్యలు చేశాడనే దానిపై అధ్యాయనం చేసి.. వేటు వేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఆదేశాలు మేరకు ఇది జరిగిందట.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ pic.twitter.com/f30MaG1giY
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025