క్రికెట్ స్కాట్‌ల్యాండ్ బోర్డు పూర్తిగా రద్దు.. జాత్యహంకారమే కారణమా?

-

క్రికెట్ స్కాట్‌ల్యాండ్ బోర్డు ఎవరూ ఊహించని విధంగా కీలక ప్రకటన చేసింది. తన బోర్డు వ్యవహారాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బోర్డు రద్దుకు సంబంధించిన లేఖను తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు బోర్డు డైరెక్టర్లకు సమర్పించారు. అయితే గతేడాది నుంచి క్రికెట్ స్కాట్‌ల్యాండ్‌ బోర్డులో జాత్యహంకారంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బోర్డు సమీక్షను కూడా నిర్వహించింది. దీనికి స్కాట్‌ల్యాండ్ బోర్డు మద్దతు కూడా తెలిపింది. ఈ క్రమంలో క్రికెట్ స్కాట్‌ల్యాండ్ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని క్రికెట్ బోర్డులు ఆశ్చర్యానికి గురయ్యాయి.

క్రికెట్ స్కాట్‌ల్యాండ్ బోర్డు
క్రికెట్ స్కాట్‌ల్యాండ్ బోర్డు

రాజీనామా లేఖలో తెలిపిన వివరాల ప్రకారం.. స్కాట్‌ల్యాండ్ క్రికెట్ బోర్డులో జాత్యహంకారంపై సమీక్ష వేసినప్పుడు తాము మద్దతు ఇచ్చామన్నారు. బోర్డులో అందరు ప్లేయర్లకు అవకాశాలు కల్పించామన్నారు. అన్ని వర్గాల ఆటగాళ్లకు బోర్డులో అవకాశం కల్పించామన్నారు. అలాగే బోర్డు అభివృద్ధి, ఆటగాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కృషి చేశామన్నారు. ఆర్థికంగా బోర్డు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి పరిస్థితిలో చిన్న బోర్డు అయిన స్కాట్‌ల్యాండ్ పని చేయడం కష్టమవుతోందన్నారు. ఈ క్రమంలోనే బోర్డును రద్దు చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news