దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని వెల్లడించారు భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత 15వ రాష్ట్రపతిగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు ద్రౌపది ముర్ము. కాసేపటి క్రితమే.. ద్రౌపది ముర్ము చేత సుప్రీం కోర్టు జడ్జి ఎన్వీ రమణ.. ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేం ద్ర మంత్రులు, ఉప రాష్ట్ర పతి తదితరులు మాట్లాడారు. అనంతరం భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి.. ప్రసంగించారు. ఢిల్లీ: జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అత్యున్నత పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ నా రాజకీయ జీవితం మొదలైంది.. 75 ఏళ్ల ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.