ప్రధాని చెప్పినా నిర్ణయం మారదు.. స్వతంత్ర అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం కుమారుడు..!

-

ఈసారి లోక్ సభ ఎన్నికల్లోతన  కొడుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధిస్తారని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత కే.ఎస్.ఈశ్వరప్ప ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి  తన మనస్సు మార్చే ప్రయత్నం చేసినా ఫలితం ఉండదన్నారు. స్వతంత్రంగా పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధిచడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉండగా కొద్ది రోజుల క్రితం బీజేపీ మొత్తం 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అంతకంటే ముందే హవేరి-గడగ్ లోక్సభ సీటును తన కుమారుడు కే.ఈ.కాంతేష్ సీటు కావాలని అదిష్టానంతో చర్చలు జరిపారు.


హవేరి లోక్సభ సీటు తన కుమారుడికి వస్తుందంటూ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సైతం హామీ ఇచ్చారు. కాంతేష్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని యడ్యూరప్ప చెప్పినట్లు ఈశ్వరప్ప తెలిపారు. అయితే అనూహ్యంగా హవేరీ లోక్సభ నియోజకవర్గం నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మెని బీజేపీ పోటీకి దింపింది. అధిష్టానం నిర్ణయంపై కేఎస్. ఈశ్వరప్ప అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో ఈశ్వరప్ప మాట్లాడుతుండగా.. ఈశ్వరప్ప మద్దతుదారులు స్వంతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగడంపై ప్రశ్నించారు. మోడీ ఒప్పిస్తే పోటీ చేయకుండా ఆగిపోతారా? అన్న ప్రశ్నకు ఈశ్వరప్ప స్పందించారు.మోడీ నిర్ణయం ఎలా ఉన్నా వెనక్కి తగ్గేది లేదు.” నా మద్దతుదారులను, కార్యకర్తలను నేను అగౌరవపరచను. నేను మీకు హామీ ఇస్తున్నాను. విజయవంతంగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానన్న నమ కం ఉంది” అని సమాధానం ఇచ్చారు ఈశ్వరప్ప.

Read more RELATED
Recommended to you

Latest news