నెక్స్ట్ సీఎం ఆయనే..!

-

బీహార్లో ఎన్నికల నగారా మోగేందుకు అంతా సిద్ధం అవుతున్న వేళ ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి నుంచి చిరాక్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ వేరుకుంపటి పెట్టడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే అందరూ పార్టీ కోసం పని చేయాలి అంటూ బీజేపీ హెచ్చరికలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక పార్టీలో డబుల్ గేమ్ ఆడుతున్న నేతలపై వేటు కూడా వేసింది. అయితే రాబోయే బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగిస్తోంది అని ఉప ముఖ్య మంత్రి సుశీల్ కుమార్ మోడీ వెల్లడించారు.

జేడీయు ఎల్జెపి మధ్య విభేదాలు తలెత్తినపుడు రెండు కూడా మిత్రపక్షాలేనంటూ వ్యాఖ్యానించిన సుశీల్ కుమార్ మోడీ.. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని నితీష్ కుమార్ తిరిగి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేస్తారు అంటూ ధీమా వ్యక్తం చేశారు సుశీల్ కుమార్ మోడీ. దీనిపై ఎలాంటి సందేహం అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఆరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు బీజేపీ అన్ని విధాలుగా సాయం చేస్తోంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version