సినిమా కోసం ఏఐ సాయంతో యంగ్ గా మారిన కట్టప్ప.. ఇండియాలో తొలిసారి

-

ఇప్పుడు ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఏఐతో తమ ఫేవరెట్ సెలబ్రిటీల ఫొటోలు రూపొందిస్తూ తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు చాలా రంగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. తాజాగా మొట్టమొదటిసారిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏఐని వినియోగిస్తున్నారట. కోలీవుడ్‌లో రానున్న ఓ సినిమాలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను  ఉపయోగించి ఓ పాత్రను యుక్తవయసులో ఉన్నట్లు చూపించనున్నట్లు సమాచారం.

‘బాహుబలి’ కట్టప్పగా అందరికీ చేరువైన నటుడు సత్యరాజ్‌ ప్రధానపాత్రలో ‘వెపన్‌’ అనే తమిళ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం సత్యరాజ్‌ వయసు 68 ఏళ్లు. కానీ, ఈ సినిమాలో ఏఐను ఉపయోగించి ఆయన 28 ఏళ్ల వయసులో ఎలా ఉంటారో చూపించనున్నారట. వెపన్‌ దర్శకుడు గుహన్‌ సెన్నియప్పన్‌ తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న కృతిమ మేధను ఉపయోగించడంతో ఈ సినిమా టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారింది.

ఇప్పటి వరకు హాలీవుడ్‌ చిత్రాలు ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ లాంటి పెద్ద సినిమాల్లో ఏఐను ఉపయోగించారు. భారతీయ సినిమాల్లో మాత్రం ఇదే తొలిసారి అని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వెపన్‌’ దర్శకుడు ఈ విషయాన్ని తెలిపారు. యంగ్‌ సత్యరాజ్‌ ఏఐ ఫొటో బయటకురావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news