రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడానికి కారణం అనవసర భయంకరమైన కలలు కూడా ఓ కారణమే. అదెంతలా ఉంటుందటే, కొన్ని సార్లు పడుకోవాలంటేనె భయమేసేంతగా. ఈ రోజు ఎలాంటి కలలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అని గజగజ వణుకుతుంటారు. హాయిగా రాత్రిపూట పడుకుని విశ్రాంతి తీసుకుకోవాలనుకునే వారికి ఈ భయంకర కలలు నరకం చూపిస్తాయి. ఐతే ఇలాంటి కలలు పడడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి ఇంట్లో కుటుంబంతో ఉండే సమస్యలే కారణం కావచ్చని అంటున్నారు.
నిత్యం గొడవలతో చిందరవందరగా ఉండే ఇళ్ళలో ఇలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటి తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ రాత్రిపూట ఆలోచనల మీద దుష్ప్రభావం చూపుతుంది. మరి వీటిని తప్పించుకోవడమెలాగో ఇక్కడ తెలుసుకుందాం.
వీటిని ఆపడానికి పటిక బాగా పని చేస్తుంది. స్పటికాకరంలో ఉండే పటికని మీరు పడుకునే మంచం కింద నల్లని వస్త్రంలో వేసి పడుకుంటే ఈ పీడకలల బారి నుండి తప్పించుకోవచ్చు.
ఇలాంటి కలలు రావడానికి ఇంట్లో జరిగే గొడవలే కాబట్టి, ఆ గొడవలు జరగకుండా ఉండడానికి పటికని, ఇంటి యజమాని పడుకునే మంచం కింద నీటిలో వేసి ఉంచాలి. ఆ తర్వాత ఆ నీటిని పీపాల్ చెట్టుకి పోయాలి. ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుందని, పటిక వల్ల అది సాధ్యం అవుతుందని చెబుతున్నారు.
ఇదే కాదు ఇంటి నుండి ప్రతికూల శక్తులను దూరం చేయడానికి, బాత్రూంలో ఒక చిన్న గిన్నెలో పటికని ఉంచితే సరిపోతుంది. పిల్లలు బాగా చదవడానికి వారి పుస్తకాలలో గులాబీ రంగు పటికని ఉంచితే పని జరుగుతుందని ఒక భావన.