బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలకు సిద్ధమైంది. ఎన్నికల రోజున ఆయన మాట్లాడుతూ.. ఏ వ్యక్తికి ఓటు వేశారో పరోక్షంగా వెల్లడించారు.
దీనిని ఎన్నికల ఉల్లంఘనగా పేర్కొంటూ చర్యలకు ఆదేశించింది ఈసీ. కాగా, ఈ అంశంపై ఇప్పటికే ఎన్నికల సంఘం కేటీఆర్ కి నోటీసులు కూడా జారీ చేసింది. వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ సైతం విధించింది. గడువు ముగిసినా వివరణ ఇవ్వకపోవడంతో చర్యలకు ఆదేశించింనట్లు తెలుస్తోంది.