మనుషులు ఆహారం లేక ప్రాణాలు విడుస్తున్నారు ఈ రోజుల్లో. అన్నం లేక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక పక్షులు, రోడ్ల మీద తిరుగుతూ ఉండే జంతువులు ఆహరం లేక ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాయి. అలాంటి పక్షల కోసం తమిళనాడులోని కోయంబత్తూరు కి చెందిన ఒక రైతు ఏకంగా పంట వేసాడు. తమిళనాడు కోయంబత్తూరులోని ముత్తు మురుగన్ అనే రైతు పక్షులను పోషించడానికి పొలం వేసాడు.
తన అర ఎకరా భూమిలో పెర్ల్ మిల్లెట్స్ & జొన్నను పెంచాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా అతన్ని జాతీయ మీడియా ప్రతినిధి పలకరించాడు. “పక్షులు సంతోషంగా పంటలపై విందు చేస్తున్నప్పుడు తనకు చూడటానికి, వాటిని చూస్తూ మాట్లాడటానికి చాలా సంతోషంగా ఉంటుంది అని అన్నాడు. మనం ప్రకృతి నుండి చాలా ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ప్రకృతికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి” అని ఆయన చెప్పారు.
Tamil Nadu: Muthu Murugan, a farmer in Coimbatore grows pearl millets & sorghum on his half-acre land to feed birds.
He says, "I love the chirping of birds while they happily feast on the crops. We need to give something back to nature when we are taking soo much from it." pic.twitter.com/pz1Mlx1bah
— ANI (@ANI) August 22, 2020