భారత దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు వేగంగా నమోదవుతున్నాయి. అలానే రికవరీ రేటు మాత్రం చాలా వేగంగా పెరుగడం కాస్త సంతోషం కలిగించే విషయం అని చెప్పరు. కరోన విషయంలో ఇండియాకి అదొక్కటే శుభవార్త అని చెప్పచ్చు. అన్ని రాష్ట్రాలు రికవరీ రేటుని వృద్ది చేస్తుండడంతో ఇండియా కరోన రేట్ కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన ప్రకారం దేశంలో గడచిన 24 గంటలలో 69,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 945 మంది మృతి చెందారు.
ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 62,282 గా ఉంది. ఇక గడచిన 24 గంటలలో నమోదయిన కేసులతో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,75,701కు చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 697,330 ఉన్నాయి. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,222,577కు చేరింది. ఇక కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 55,794కు చేరింది, ఇక దేశంలో 74.30 శాతానికి రికవరీ రేటు చేరింది.