ఆ హోటల్ లోని ఐదో అంతస్తు.. ప్రభుత్వం ఎంతో రహస్యంగా ఉంచుతోంది..!

-

దేశానికి సంబంధించిన ఎలాంటి వివరాలూ ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. కేవలం ఆయన ప్రకటనలు తప్ప ఎలాంటి విషయాలు బయటకు రానివ్వరు. బయట జరిగే విషయాలు కూడా దేశస్థులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. అందుకే ఉత్తర కొరియాను ఒక రహస్యాల పుట్టగా ప్రపంచదేశాలు భావిస్తుంటారు.

ఉత్తర కొరియాలోని ఓ హోటల్ లోని ఐదో అంతస్తును కూడా ప్రభుత్వం ఎంతో రహస్యంగా ఉంచుతోంది. ఎవర్నీ ఆ ఐదో అంతస్తులో అనుమతించరు. అంతలా ఆ ఫ్లోర్ లో ఏముంది. ఎందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించదు?. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ పరిధిలోని టాయిడాంగ్ నదిలో ఉన్న ఐలాండ్స్ లో ఉందీ యాంగ్గాక్ డో హోటల్ ఉంది. ఆ దేశంలోనే అత్యంత ఎత్తయిన భవంతుల్లో ఇదీ ఒకటి. ఇది ఉత్తర కొరియాలో తొలి లగ్జరీ హోటల్ గానూ పేరుంది.

1986లో ఈ హోటల్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ హోటల్ వెయ్యి గదులు, నాలుగు రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్, గేమింగ్ జోన్ తదితర సదుపాయాలను అమర్చింది. విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఈ హోటల్ లోనే బస చేస్తుంటారు. అయితే ఈ హోటల్ మొత్తంగా 47 అంతస్తులను కలిగిఉంది. కానీ ఐదో అంతస్తులోకి మాత్రం సాధారణ ప్రజలు, పర్యాటకులకు అక్కడి ప్రభుత్వం అనుమతించదు. లిఫ్ట్ లో ఐదో అంతస్తుకి వెళ్లడానికి బటన్ సదుపాయం కూడా ఉండదు.

అయితే కొంత మంది పర్యాటకులు ఆ ఫ్లోర్ లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ప్రయత్నం చేశారు. కానీ, ఉత్తర కొరియాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. అయినా కొందరు సాహసించి ఫోటోలు, వీడియోలు తీసి బయటపడ్డారు. పర్యాటకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ హోటల్ లో ఐదో అంతస్తును రెండు అంతస్తులుగా విభజించి ఉందన్నారు. గోడలపై అమెరికా, జపాన్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలతో పోస్టర్లు అంటించి ఉన్నాయన్నారు. ఒకటి, రెండు గదులులకు తప్పా మిగిలిన వాటికి తాళాలు వేసి ఉన్నాయన్నారు. అన్ని హోటళ్ల మాదిరిగా అది కూడా ఒక సర్వీస్ లెవల్ మాత్రమేనని పేర్కొన్నారు. కానీ మరికొందరూ ప్రపంచానికి తెలియకుండా ఉత్తరకొరియా ఎదో రహస్యాన్ని దాచిపెడుతోందని అనుమానిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news