లవ్ జీహాద్ లో చట్టంలో తొలి కేసు

-

బలవంతపు లేదా మోసపూరిత మత మార్పిడులను అరికట్టే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన లవ్ జీహాద్ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదించిన తర్వాత అది పూర్తి స్థాయిలో చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం ఆదివారం బరేలీలోని డియోరానియా పోలీస్ స్టేషన్ లో తొలి కేసు నమోదైంది. ఒక మహిళను ఇస్లాం మతంలోకి మారాలి అంటూ బలవంతం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఈ కేసు నమోదు చేసారు.

“లవ్ జిహాద్” సంబంధిత నేరాలకు గరిష్టంగా 10 సంవత్సరాల శిక్షను ప్రతిపాదించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నవంబర్ 24 న ఆర్డినెన్స్‌ ను ఆమోదించారు. క్రొత్త చట్టానికి ఒక నిబంధన కూడా ఉంది. దీని ప్రకారం ఎవరైనా వారి అసలు మతానికి తిరిగి వస్తే, అది మార్పిడిగా పరిగణించబడదు. ఈ చట్టంపై కొన్ని వర్గాలు విమర్శలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news