కార్తీక పౌర్ణమి పుణ్యమా అని సరిహద్దులు మూసేసిన సిఎం

-

గంగా పవిత్ర స్నానం చేయడానికి భక్తులు హరిద్వార్ జిల్లాలోకి ప్రవేశించకుండా చేయడానికి గానూ ఆ రాష్ట్ర సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరిద్వార్ సరిహద్దులు ఈ రోజు మరియు రేపు మూసివేయబడతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. “రద్దీని నివారించడానికి, కార్తీక్ పూర్ణిమ సందర్భంగా భక్తులను గంగాలో పవిత్ర స్నానాలకు అనుమతించడం లేదు అని ఎస్పీ సెంథిల్ అబుడాయ్ కృష్ణరాజ్ చెప్పారు.

ఆ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా కాస్త ఆ రాష్ట్రంలో భక్తులు ఎక్కువగా వస్తు ఉంటారు. దీని వలన ప్రభుత్వం కాస్త ఆందోళన వ్యక్తం చేస్తుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కాస్త కఠినంగా లాక్ డౌన్ ని కూడా అమలు చేస్తుంది సర్కార్. ఇక రాష్ట్రంలోకి వచ్చే వారు కరోనా పరిక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news