బంగ్లాదేశ్ తో భారత్ కి ఉన్నటువంటి సంబంధాలపై విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందించారు. బంగ్లాదేశ్ తో ఇదివరకు లాగానే స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. దీంతో ఇరు దేశాలకు మేలు జరుగుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బంగ్లాదేశ్ లోని ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాల గురించి అడిగిన ప్రశ్న పై స్పందించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఏం జరిగినా అది వారి అంతర్గత వ్యవహారం అన్నారు.
ముఖ్యంగా పొరుగు దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం చాలా అవసరమన్నారు. భారత్ పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని భావిస్తోంది. బంగ్లాదేశ్ తో స్నేహ పూర్వక సంబంధాన్ని అలాగే ఉంచాలనుకుంటున్నాం. వాణిజ్యపరంగా బంగ్లాదేశ్ తో మంచి సంబంధాలున్నాయని.. ఇలాగే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నట్టు జై శంకర్ తెలిపారు.