పాతబస్తీ యువతిని ఆ దేశస్థుడికి అమ్మేసింది..!

పాతబస్తీలో అమాయక యువతులకు డబ్బుఆశ చూపి గుట్టుచప్పుడు కాకుండా దళారులు విదేశాలకు అమ్మేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా..ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నావి. తాజాగా మరో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పాతమస్తీ చాంద్రాయణ గుట్టకు చెందిన ఓ యువతిని దుబాయిలో నర్సు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ దళారి సుడాన్‌ షేక్‌కు విక్రయించింది. అక్కడ అష్టకష్టాలు పడుతున్న ఆ యువతి ఎంతో కష్టంతో తన ఇంటి వాళ్లకు సమాచారం అందించింది. దీంతో బా«ధిత కుటుంబీకులు తమ అమ్మాయిని భారత్‌కు రప్పించాలని ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్‌ ద్వారా విదేశీ వ్యవహారాల శాఖకు విన్నవించిరు.

 

మూడు నెలల కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌..

బండ్లగూడ గౌస్‌నగర్‌ హుందాహిల్స్‌కు చెందిన నూర్జహాన్‌ శంషీర్‌గంజ్‌లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేది. అదే ఈ సమయంలో వట్టెపల్లికి చెందిన ఫాతిమా అనే మహిళ నూర్జహాన్‌తో పరిచయం పెంచుకుంది. షార్జాలో తనకు తెలిసిన వారున్నారని అక్కడి ఆస్పత్రిలో పనిచేస్తే నెలకు రూ.40 వేలు వస్తాయని, నమ్మించి డిసెంబర్‌ 15న నూర్జహాన్‌ను షార్జాకు పంపించింది.షార్జా చేరుకున్న నూర్జహాన్‌ను అమ్మర్‌ అహ్మద్‌ ఉమర్‌ అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. గతంలో ఫాతిమాతో కలిసి ఉండే నజ్మీన్‌ అనే ఓ బాలిక ఉమర్‌ ఇంట్లో చేసిన షాక్‌కు గురైంది. మూడు నెలల కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌ కింద నజ్మీన్‌ను పంపించినట్లు నూర్జహాన్‌కు తెలిసింది. అమ్మర్‌ తాను ఫాతిమాకు రూ.2 లక్షలు చెల్లించినట్టు నూర్జహాన్‌తో చెప్పాడు. ఫాతిమాకు అమ్మర్‌ ద్వారా ఫోన్‌ కాల్‌ రావడంతో నూర్జహాన్‌ తల్లి వద్దకు వెళ్లి ఆమె ముందు రూ.2 లక్షలు పెట్టి వీడియో తీసి షేక్‌కు పంపించారు. అనంతరం డబ్బు తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఈ వీడియా చూసిన అనంతరం నూర్జహాన్‌పై నాలుగు రోజులుగా షేక్‌ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై తాను పడుతున్న నరకాన్ని వాట్సాప్‌ వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు వెల్లడించింది. అయితే .. కుటుంబ సభ్యుల నుంచి తనకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆ పరిధి సీఐ తెలిపారు.