మీరు ప్రేమించిన అమ్మాయి మీ నుండి దూరంగా వెళ్ళిపోతోందా..? ఈ తప్పులు మాత్రం చెయ్యద్దు..!

-

ఒక్కొక్కసారి మీరు ప్రేమించిన అమ్మాయి(girl) మీ నుండి దూరంగా వెళ్లిపోవచ్చు. మీరు ఆమె కోసం ఏం చేసినా మీరు ఆమె కోసం ఏమి ఇచ్చినా సరే ఆమె మీ ప్రేమని వదులుకుని దూరంగా వెళ్ళి పోతూ ఉంటుంది. అటువంటి సమయంలో మీరు నిలకడగా ఉండండి.

అమ్మాయి(girl)

పదేపదే వాళ్లని బతిమాలడం లాంటివి అస్సలు చేయొద్దు. సమయం కోసం మీరు ఆమెని బ్రతిమాలడకండి. ఆమె మీతో మాట్లాడక పోయినా లేదు అంటే మీ పై అయిష్టం చూపించిన పదే పదే ఆమెని అడగొద్దు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావ్, కాస్త సమయాన్ని పంచుకోవాలని అస్సలు ఆమెను అడగకండి. ఇలా అడగడం వల్ల వాళ్లు మరింత దూరం పెట్టేస్తారు.

ఇతరులతో మాట్లాడండి:

పదేపదే మిమ్మల్ని వదిలేసిన అమ్మాయి గురించి మీరు యాతన పడడం వలన ఉపయోగం ఏమీ లేదు. ఆమె మీ ప్రేమ నుండి దూరంగా వెళ్ళి పోతూ ఉంటే అప్పుడు మీరు ఇతరులతో మాట్లాడటం ఇతర అమ్మాయిలతో స్నేహం చేయడం లాంటివి చేయండి. అంతేకానీ పదేపదే ఆమెని బతిమాలడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కలుగదు. ఒకవేళ కనుక ఆమెకి మీ పై ఆసక్తి ఉంటే ఆమే వస్తుంది.

ఫ్రస్ట్రేషన్ చూపించొద్దు:

మీరు బాధ పడుతున్నట్లు కానీ ఇబ్బంది పడుతున్నట్లు కానీ అస్సలు తెలియ చేయద్దు. మీరు అలా తెలియజేయడం వల్ల ఆమె తిరిగి వస్తుంది అనుకోవడం పొరపాటు. కాబట్టి మీరు ఎప్పటిలాగే ఉండండి అంతే కానీ మీరు కోపంగా మాట్లాడడం లేదు అంటే ఆమెను ఇబ్బంది పెట్టడం లాంటివి చేయొద్దు ఆమెను పట్టించుకోకపోయినా ఆమెకి కనుక నిజంగా ప్రేమ ఉంటే తిరిగి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version