ఇన్నాళ్ళుగా పెట్రోల్ ధరలతో భయపడిపోయిన వాహనదారులకు ఇప్పుడు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్ డీజిల్ ధరలు రెండు రూపాయల మేర తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడమే దీనికి కారణమని అంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర జనవరి ఆరంభం నుంచి భారీగా తగ్గుతూ వచ్చింది. పెట్రోల్ ధర రూ.2.05 క్షీణించింది. ఇక డీజిల్ ధర రూ.1.89 తగ్గింది.
జనవరి నెలలో పెట్రోల్ ధర లీటరుకు హైదరాబాద్‌లో రూ.79.96 నుంచి రూ.77.91కు పడిపోయింది. అంటే దాదాపుగా రూ.2కు పైగా తగ్గింది. డీజిల్ విషయానికి వస్తే లీటరుకు రూ.74.16 నుంచి రూ.72.27కు దిగొచ్చింది. దాదాపు రూ.2 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధర గత నెల రోజుల కాలంలో భారీగా తగ్గాయి. విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగానే తగ్గాయి.
జనవరి ఆరంభంలో లీటరు పెట్రోల్ ధర రూ.79.14 ఉండగా… అదే ఇప్పుడు పెట్రోల్ ధర రూ.77.46కు క్షీణించింది. డీజిల్ ధర కూడా లీటరుకు రూ.73.03 నుంచి రూ.71.82కు తగ్గింది. జనవరి 1న బ్యారెల్‌కు 65 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర జనవరి నెల చివరి కల్లా 56.8 డాలర్లకు పతనమైంది. అమెరికా, ఇరాన్ పరిస్థితులు చల్లబడటం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు నిపుణులు.