ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. చైనాలోని ఊహాన్ నగర్ లో పుట్టిన ఈ వైరస్ ధాటికి ఇప్పటికే 250 మంది వరకు ప్రాణాలు కోల్పోగా మరో 10 వేల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. దీనితో చైనా సహా అనేక దేశాల్లో ఈ వ్యాధికి సంబంధించి ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దాదాపు అన్ని దేశాలు కూడా హెల్త్ ఎమర్జెన్సిని ప్రకటించాయి.
చైనాలో అయితే ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వ్యాధి సోకింది అనే అనుమానం వస్తే చాలు కఠిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను అధికారులు మూసివేసారు. ఇక పలు నగరాలకు రాకపోకలను కూడా ఆ దేశంలో నిలిపివేశారు. ఇక వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఆస్పత్రులను కూడా నిర్మిస్తుంది చైనా ప్రభుత్వం.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారింది. ఒక చిన్నారికి కరోనా వైరస్ సోకగా ఆ చిన్నారిని వైద్యుడు ప్రత్యెక వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నాడు. ఆ చిన్నారి బయటకు రావడానికి ప్రయత్నించగా దాన్ని చూసిన వైద్యుడు వెనక్కి తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు దీన్ని చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తుంది. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.