మెగా హీరో చిత్రం నుంచి.. తప్పుకున్న హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల షూటింగులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి సినిమా షూటింగ్ లు ప్రారంభించు కునేందుకు అనుమతి వచ్చిన నేపథ్యంలో.. మొన్నటివరకు సినిమా షూటింగులు ఆగిపోయి ఆందోళనలో మునిగిపోయిన దర్శక నిర్మాతలందరూ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లు శరవేగంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో అనుకున్న విధంగా కాకుండా సినిమాలో నటీనటుల డేట్స్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమాలో కూడా ఇలాంటి మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. సాయిధరమ్తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ముందుగా చిత్రబృందం నివేదా పేతురాజ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం డేట్స్ ఖాళీ లేనందున నివేదా పేతురాజ్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఆ హీరోయిన్ ప్లేస్ లో తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను చిత్రబృందం తీసుకునేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.