నారప్ప షూటింగ్.. వెంకటేష్ కొత్త రూల్..!?

గత కొంతకాలం నుంచి ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాల పై దృష్టి పెట్టిన విక్టరీ వెంకటేష్ మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలే వెంకటేష్ ఒక్కడే హీరోగా ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన అసురన్ తెలుగు రీమేక్ లో ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఇక కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో అందరి హీరోల సినిమాల షూటింగు ప్రారంభం అవుతున్నాయి. క్రమంలోని నారప్ప సినిమా షూటింగ్ కూడా ప్రారంభించేందుకు వెంకటేష్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం రెండు నెలల సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడికి కండిషన్ పెట్టాడట వెంకటేష్. దీంతో శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు దర్శకుడు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.