అసలు సీత గా మారేది ఎవరు..?

ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యాం సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆది పురుష్ అనే సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదల చేసి అభిమానులందరినీ ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఎంతో డిఫరెంట్ గా ఉండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మొదటి సారిగా రాముడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి.

prabhas

అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తాడని తెలిసినప్పుడి నుండి సీత పాత్రలో ఏ హీరోయిన్ నటించబోతుంది అనే టాక్ టాలీవుడ్ లో మొదలైంది. సీత పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనేదానిపై ఎంతో మంది హీరోయిన్ల పేర్లు ప్రతి రోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అనుష్క శర్మ, అనుష్క శెట్టి, భూమి పెడ్నేకర్, కియారా అద్వానీ శ్రద్ధాకపూర్ లాంటి ఎంతో మంది హీరోయిన్ల పేర్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతూ ఉండగా చివరికి ఎవరు సీతగా మారబోతున్నారు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.