‘వ్యూహం’ మూవీ రిలీజ్ పై హైకోర్టులో రేపు విచారణ

-

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపు చేపడుతామని కోర్టు వెల్లడించింది. వ్యూహం సినిమా రిలీజ్ అంశంపై తాజాగా విచారణ జరిగింది. గతంలో సింగిల్ బెంచ్ లో చిత్ర యూనిట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో మూవీ విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని సినిమా యూనిట్ న్యాయ స్థానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికెట్ తో పాలు పలు రికార్డులను ఇప్పటికే సెన్సార్ బోర్డు కోర్టుకు అందజేసింది. సెన్సార్ బోర్డు రికార్డులను పరిశీలించిన తరువాత విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపిన విషయం విధితమే. విడుదల సమయంలో ఆలస్యం జరిగితే భారీ నష్టం వస్తుందని వ్యూహం మూవీ నిర్మాత దాసరి కిరణ్ కుమీర్ కోర్టును అభ్యర్థించిన విషయం విధితమే. వ్యూహం సినిమాని అడ్డుకునేందుకు తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సినిమా విడుదల అంశంలో జాప్యం ఎదురైంది.

Read more RELATED
Recommended to you

Latest news