ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ తిరుపతిలో జరిగిన ఘటన పై తాజాగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా తొక్కిసలాట జరిగి మరణించలేదు. ఎప్పుడూ కూడా మనం చూడలేదు. ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన కారణాలు ఏంటి..? అని ఆరా తీస్తే.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైకుంఠ ఏకాదశమి ప్రతీ యేటా జరుపుకున్నాం. కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని గుర్తు చేశారు.
వైకుంఠ ఏకాదశి రోజు లక్షలాది భక్తులు వస్తారని తెలుసు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన ఎప్పుడూ జరగలేదు. లక్షలాది భక్తులు వస్తారని తెలిసి కూడా ఎందుకు టికెట్ల కౌంటర్ల వద్ద భద్రత పెంచలేదని ప్రశ్నించారు. బైరాగిపట్టెడ పద్మావతి పార్కు దగ్గర ఒక కౌంటర్ పెట్టారు. ఒక్కసారిగా పార్కు గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కచోటే తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించారు.