సెమీస్ కు దూసుకెళ్లిన భారత పురుషుల హాకీ జట్టు

టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు… మరోసారి తన సత్తా చాటింది. రసవత్తర పోరులో… ధీటుగా ఆడి… సెమీస్ లోకి దూసుకు వెళ్ళింది భారత పురుషుల హాకీ జట్టు. గ్రేట్ బ్రిటన్ హాకీ టీం తో క్వార్టర్ ఫైనల్ లో తలపడ్డ భారత పురుషుల హాకీ జట్టు..  అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత హాకీ జట్టు నేరుగా సెమీస్ లోకి దూసుకు వెళ్ళింది.

దీంతో ఒలంపిక్స్ ఈ పథకం కోసం 41 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికింది భారత హాకీ జట్టు. 1960 లో  జరిగిన ఒలింపిక్స్ తర్వాత పతకం సాధించే దిశగా భారత పురుషుల హాకీ జట్టు అడుగులు వేసింది. సెమీ ఫైనల్స్ లో అడుగు పెట్టడమే లక్ష్యంగా భారత్ మరియు గ్రేట్ బ్రిటన్ జట్లు బరిలోకి దిగాయి. అయితే ఇవాళ జరిగిన ఈ రసవత్తర పోరులో భారత హాకీ జట్టు 3-1 తే గోల్స్ తేడాతో విజయం సాధించింది.