కొత్త టెక్నాలజీ.. ఇక నిమిషాల్లోనే కరోనా టెస్ట్ ఫలితం..?

-

ప్రస్తుతం ప్రభుత్వాలు కరోనా వైరస్ పరీక్షలు చేపడుతున్నప్పటికీ ఫలితాలు రావడానికి మాత్రం కాస్త సమయం పడుతుండటంతో కరోనా లక్షణాలు ఉన్న బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా పరీక్ష చేసిన 90 నిమిషాల్లోనే ఖచ్చితమైన ఫలితం అందించే విధంగా లండన్ శాస్త్రవేత్తలు కీలక అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా డిఎన్ఏ నడ్జ్ పరీక్ష ద్వారా కేవలం గంటన్నర వ్యవధిలోనే ఖచ్చితమైన ఫలితం వస్తుందని గుర్తించారు.

ప్రస్తుతం అన్ని దేశాలు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలో డి ఎన్ ఎ ఆధారిత టెస్టులను లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో చెందిన నిపుణులు రూపొందించారు. దీనికి సంబంధించిన ప్రయోగాలు కూడా విజయవంతం అయ్యాయి. అయితే 94.4 శాతం ఖచ్చితత్వంతో ఈ టెస్టులో కరోనా ఫలితం వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఎలాంటి ప్రత్యేకమైన పరికరాలు కూడా అవసరం లేదని.. ఇక ఈ టెస్ట్ లో భాగంగా కరోన లక్షణాలు ఉన్నవారికి నుంచి శ్వాబ్ నమూనా తీసుకుంటామని అంటూ నివేదికలో తెలిపారు పరిశోధకులు. దీనికి సంబంధించిన పరికరం చిన్న డబ్బా మాదిరిగా ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version