కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే చేనేత కార్మికుల పాలిట శాపంగా మారింది. గత మూడు నెలలుగా నేతన్నలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కానీ ఓ నేతన్న పనులులేక ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన తడక శ్రీనివాస్ అనే వ్యక్తి చేనేత పరిశ్రమలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అతడు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న కనీసం మందులు కూడా కొనలేని స్థితిలో తీవ్ర మనస్థాపానికి గురైన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చేనేత కార్మికులు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.