వధూవరులకు ఏర్పాటు చేసే తొలి రాత్రి రోజు వధువు పాల గ్లాస్‌తో బెడ్‌రూంలోకి వస్తుంది. చాలా సినిమాల్లో దీన్ని చూపిస్తారు. అయితే వధువు అలా పాల గ్లాస్‌తో శోభనం గదిలోకి రావడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఎప్పటి నుంచో దీన్ని ఆచరిస్తున్నారు. పాల గ్లాస్‌తో వెళ్లే వధువు పాలిచ్చే తల్లిగా బయటకు రావాలని పెద్దలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇక ఆ రోజు ఇచ్చే పాలకు కూడా స్పెషాలిటీ ఉంటుంది. అదేమిటంటే..
తొలి రాత్రి పాలలో బాదంపప్పు, మిరియాల పొడి, కుంకుమ పువ్వు తదితర పదార్థాలు కలిపి ఇస్తారు. అందువల్ల ఆ పాలు చాలా ప్రత్యేకం. వాటిని వధూవరులు ఇద్దరూ చెరిసగం తాగడం వల్ల వారి మధ్య బంధం బలపడుతుంది. అలాగే వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా పురుషుడిలో వీర్యం వృద్ధి చెందుతుంది. ఫలితంగా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పాలను తాగడం వల్ల శరీరం, మనస్సు రిలాక్స్ అవుతాయి. అలాగే శరీరంలో హ్యాప్పీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఇద్దరి మనస్సులను రిలాక్స్‌గా ఉంచుతాయి. అలాగే ఇద్దరిలోనూ శృంగార ప్రేరేపణలు ఏర్పడి ఇద్దరూ ఒక్కటవుతారు. సహజంగానే తొలి రాత్రి అంటే దంపతులిద్దరి మధ్య సిగ్గు ఉంటుంది. ఇబ్బందిగా ఫీలవుతారు. కానీ పాలను చెరి సగం పంచుకుని తాగడం వల్ల వారిద్దరి మధ్య ఉండే దూరం తగ్గుతుంది. ఇద్దరి మధ్య బంధం దృఢంగా మారుతుంది.
తొలిరాత్రి ఇచ్చే పాలు ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే అమైనో యాసిడ్లు వరుడిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. రతి సమయంలో ఇద్దరి శరీర ఉష్ణోగ్రతలు సహజంగానే పెరుగుతాయి. ఆ వేడిని తగ్గించేందుకు పాలు ఉపయోగపడతాయి.
వాత్సాయనుడు రచించిన కామసూత్రలోనూ పాల గురించి వర్ణన ఉంది. అప్పట్లో శక్తి, శృంగార సామర్థ్యం పెరిగేందుకు పాలు తాగేవారని తెలుస్తోంది. కొన్ని చోట్ల పాలల్లో పైన తెలిపిన పదార్థాలతోపాటు సోంపు, తేనె, పసుపు కూడా కలిపి తాగుతారట. ఇక పాలలో ఉండే విటిమన్ డి అలసట, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. పాలల్లో మిరియాల పొడి కలుపుకుని తాగితే రక్తనాళాలు ఉత్తేజమవుతాయి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు. అందుకనే పురాతన కాలం నుంచి తొలి రాత్రి పాలను తీసుకెళ్లే ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు.