అమ్మాయిలకు గోళ్లను మంచి షేప్ లో పెంచడం వాటికి డ్రస్ కు తగ్గట్టు నెయిల్ పాలిష్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. దాదాపు చాలామంది అమ్మాయిలు తమ గోళ్లమీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. ఇంకా గోళ్ల అందాన్ని మరింత పెంచడానికి మెనిక్యూర్ లాంటివి కూడా చేయించుకుంటారు. అయితే మాములుగా అమ్మాయిలు వాడే నెయిల్ పాలిష్ కాస్ట్ 40-60 ఒక్కటి ఉంటుంది. మరీ సో కాల్డ్ బ్రాండ్ అంటే.. ఒక్కటి 500 వరకు ఉంటుంది అనుకుందాం..కానీ ప్రపంచంలో ఖరీదైన నెయిల్ పాలిష్ కాస్ట్ ఎంతో తెలుసా..? ఇప్పటికే మనం ఖరీదైన లిప్ స్టిక్ గురించి తెలుసుకున్నాం..కానీ ఇది దానికంటే…ధరలో దాటేసింది.
లాస్ ఏంజిల్స్ డిజైనర్ అజాచర్ పోగోసియన్ ప్రత్యేకమైన నెయిల్ పాలిష్ రూపొందించారు. ఇది నలుపు రంగులో ఉంటుంది. అలాగే గోళ్ల అందాన్ని ఇది మరింత పెంచుతుంది. దీని ధర దాదాపు 250,000 డాలర్లు. అంటే మన భారతీయ మార్కెట్లో దీని ధర 1 కోటి 90 లక్షలు. దాదాపు రూ. 2 కోట్లు విలువైన ఈ నెయిల్ పాలిష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదై నెయిల్ పాలిష్ గా చోటు సంపాదించుకుంది..వామ్మో ఏంట్రా బాబు ఇంత కాస్ట్ ఏం పెట్టి చేశారు అసలు, బంగారం, వజ్రాలను ఏమైనా వేశారా ఏంటి అని డౌట్ వస్తుంది కదా..
ఓ లగ్జరీ జ్యువెల్లరీ డిజైనర్ దీనిని డిజైన్ చేసి అందులో 267 క్యారెట్ల నల్లటి వజ్రాలను చేర్చారట. నల్లటి వజ్రాల వాడకం వలన ఇంత విలువ ఉంటుంది.
ఆజాచర్ కాకుండా.. మార్కెట్లో చాలా ఖరీదైన నెయిల్ పాలిష్ లు ఉన్నాయి. వీటిని ప్లాటినం పౌడర్‌తో తయారు చేస్తారు. ఇది కాకుండా.. అనేక రకాల నెయిల్ పాలిష్ లు వాటిని ఏర్పర్చిన బాటిల్ కారణంగా కూడా ప్రత్యేకంగా నిలిచాయి. అమ్మాయిలు వాడే మేకప్ ప్రొడెక్ట్స్ మాములుగానే కాస్త ఖరీదైనవిగా ఉంటాయి..కానీ ప్రపంచంలో ఇంత ఖరీదైనవిలో ఇవి కూడా ఉండటం విశేషమే..
-Triveni Buskarowthu