BREAKING : స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి కేటీఆర్‌ ఘాటు లేఖ

-

బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపైన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ రాశారు. కేంద్ర స్టీల్ శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ కి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. బయ్యారంలో అపార ఖనిజ సంపద ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంకల్ప లోపమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి శాపమని.. తమకు అలవాటైన వివక్షనే బయ్యారం ప్లాంట్ విషయంలోనూ మోడీ ప్రభుత్వం చూపిస్తుందని మండిపడ్డారు.

పార్లమెంటు సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కిన హామీని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని..దేశంలో ఉన్న ఇనుప ఖనిజ నిల్వలో సుమారు 11 శాతం బయ్యారంలోనే ఉందని లేఖలో పేర్కొన్నారు. కొత్త ప్లాంట్ పెట్టే ఆలోచనే లేదన్న కేంద్ర ప్రభుత్వం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని పాత ప్లాంట్ల ఆధునీకరణ కోసం 71 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.

బయ్యారానికి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో భాగం అయ్యేందుకు మాప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పినా కేంద్రం నుంచి కనీస స్పందన లేదని.. చత్తీస్ ఘడ్ నుంచి ఎన్ యండిసి ఐరన్ ఓర్ సరఫరా చేస్తామని హమీ ఇచ్చినా కేంద్రం కదలడం లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రధాని సహా పలుసార్లు కేంద్ర మంత్రులను కలిసి చేసిన విజ్ఘప్తులను గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news