జనసేన అధినేత పవన్ కల్యాణ్ నరసాపురంలో మత్య్సకారుల అభ్యున్నతి సభలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు సంబంధించిన ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 217 ను చింపేశారు. జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సభను ఏర్పాటు చేశారు. జీవోపై ప్లాన్ చెప్పను. అవసరం అయితే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీలో ఒక్కడికి గుండె ధైర్యం వస్తే ప్రతీ ఒక్కరికీ ధైర్యం వస్తుంది.
వైసీపీ పిచ్చి పిచ్చి వేషాలకు జనసేన భయపడదని పేర్కొన్నారు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఏ స్థాయిలోనైనా పోరాడుతాను అని.. మత్స్యకారుల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. చెరువులు వదిలేయండి. మత్స్యకారులకు వదిలేస్తే బాగుంటుంది. మత్స్యకారుల జీవనోపాధిని కొట్టకండి. వైసీపీకి అధికారం ఇచ్చింది చికెన్, మటన్ కొట్టులను పెట్టుకోవడానికా అని ప్రశ్నించారు. ముఖ్యంగా నేను వంగి వంగి దండాలు పెట్టడానికి రాజకీయాల్లోకి రాలేదు అని, చిన్న వలతో సముద్రంలోకి వెళ్లాలంటే మత్స్యకారులకు ఎంత సహనం ఉండాలని పేర్కొన్నారు.