ప్రపంచ మహమ్మారి కరోనా ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 2.34 కోట్లకు చేరుకున్నాయి. ఇక కరోనా మరణాలు 8 లక్షలు దాటేశాయి. ఇవి అధికారిక లెక్కల ప్రకారం.. ఇక అనధికారిక లెక్కల ప్రకారం ఇవి మరింత ఎక్కువుగా ఉంటాయి. ఇక మనదేశంలో కరోనా కేసులు 30 లక్షలు దాటేయగా.. మరణాలు 56 వేలు క్రాస్ అయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్ అంటూ ఇదే అని ఘంటాపథంగా చెప్పుకునే మందు ఒక్కటీ లేదు. మరోవైపు రష్యా మాత్రం వ్యాక్సిన్ రిలీజ్ చేసి ప్రజలకు పంచుతోంది.
ఇదిలా ఉంటే కరోనా రోగుల మృతదేహాలను పోస్టుమార్టం చేస్తుంటే షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కరోనా లక్షణాలను కనుకోవడం శాస్త్రవేత్తలకు మరింత సవాల్ కానుంది. కరోనా కారణంగా మృతి చెందిన వారి ఊపిరితిత్తుల్లో గాయాలు కనపడడంతో పాటు వారి రక్తం కూడా గడ్డకడుతోందట. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఊపిరితిత్తుల నిపుణులు వెల్లడించారు. ఇందుకోసం పది పోస్టుమార్టంలు చేయగా… మృతులు అందరికి ఊపిరి తిత్తుల్లో గాయాలు, మచ్చలు ఉండడం కామన్‌గానే ఉన్నాయట.
ఇక ఊపిరితిత్తుల్లో మచ్చలు అనేవి ప్రారంభ లక్షణాలుగా చెపుతున్నారు. కిడ్నీల్లోనూ కొందరికి గాయాలు ఉన్నాయని చెపుతున్నారు. ఈ పది పోస్టుమార్టమ్‌లలో నివేదికల్లో చూస్తే తొమ్మది మందికి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల్లో మచ్చలు, గాయాలు సహజంగానే ఉన్నాయి నిపుణులు పేర్కొన్నారు. అయితే దీనిని ప్రారంభ దశలో గుర్తిస్తే.. ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకోవడం ద్వారా మరణాలకు బ్రేక్ వేయవచ్చని చెపుతున్నారు. ఇక బ్లడ్ తిన్నర్స్‌ను ఉపయోగించటం ద్వారా రక్తం గడ్డకట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చని వీరి పరిశోధనలో వెల్లడైంది.