శ్రీశైలం జలాశయం పై ముగిసిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పరిశీలన

-

శ్రీశైలం జలాశయం పై ప్రపంచ బ్యాంకు, డ్యామ్ సేఫ్టీ, సీడబ్ల్యూసీ అధికారుల పరిశీలన ముగిసింది. యాంటీ జలాస్కి ప్రపంచ బ్యాంక్ టెక్నికల్ ఎక్స్పర్ట్ వారితో పాటు ముక్కల రమేష్, రాజగోపాల్, సీడబ్ల్యూసీ సేలం ఆధ్వర్యంలో నిన్న ఈరోజు పరిశీలన జరిగాయి. రెండు రోజులుగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జలాశయం అధికారులతో కలిసి సమావేశమై జలాశయానికి సంబంధించిన ప్లాంజ్ ఫుల్, అప్రోచ్ రోడ్డు డ్యామ్ గేట్లు కొండ చర్యలకు సంబంధించిన వాటిని అధికారులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో మొదటి పేజ్ కింద 103 కోట్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆమోదం తెలిపినట్లు జలాశయం అధికారులు తెలిపారు.

జలాశయం సీఈ కబీర్ డ్యామ్ సేప్టీ అధికారి నూతన కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. డ్యామ్ మరమ్మతుతుల పేజ్-1 కింద 103 కోట్లకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఈ ఏడాదే నవంబర్ లో డ్యామ్ మరమ్మతులకు టెండర్లు పిలవనున్నట్టు తెలిపారు. వరదల కారణంగా డ్యామ్ ముందు భాగంలో ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ కి 10 కోట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version