చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. వారి నిజ స్వరూపాన్ని భగవంతుడే ప్రజల ముందు ఉంచాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ గెలవదనే ఘటన చండీగఢ్ మేయర్ ఎన్నిక నిరూపించిందని అన్నారు.’జనవరి 30 నాటి ఎన్నిక ఫలితాన్ని మారుస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్షన్లలో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుంది అని విమర్శించారు.
ఎమ్మెల్యేలకు ఎరవేయడం, ప్రభుత్వాలను బహిరంగంగా కూల్చివేసే ప్రయత్నాలు చేస్తుందని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. వాళ్లు ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. డీల్లీ సరిహద్దులో కొనసాగుతోన్న రైతుల ఆందోళనలపై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ రైతులను నగరంలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.