24న ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ లుక్ రిలీజ్

-

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’ . ఈ మూవీ నుంచి ఈ నెల 24న ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఆ రోజు ఉదయం 11.59 గంటలకు నాని ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.వచ్చే శనివారం నాని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తారు.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఎస్‍జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ  చిత్రం  ఫస్ట్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది . యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.నాని,వివేక్ కాంబినేషన్‍లో  వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే భిన్నమైన కథాంశంతో రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news