పాతి పెట్టిన మాంసం తవ్వి తీసుకెళ్ళిన జనం…!

-

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం ఆల్లాడుతుంటే కొందరు మాత్రం తమకు కావాల్సిన వాటి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తిండి విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. వాళ్లకు ఏది కావాలి అంటే అది తినడానికి మార్కెట్ వద్ద బారులు తీరుతున్నారు. చిన్న చిన్న కోరికల కోసం కక్కుర్తి పడే పరిస్థితికి జనాలు వచ్చారు అనేది వాస్తవం. ప్రజల ప్రాణాలను దృష్టి లో పెట్టుకుని ఆంక్షలు విధిస్తున్నా జనం మారడం లేదు.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో క్రాస్‌రోడ్డులో ఆదివారం 25 కేజీల పొట్టేలు మాంసం, గొడ్డేరు వాగులో వధించిన ఆవు తలను, త్రిభువని కూడలి వద్ద 16 కోళ్లను మున్సిపల్‌ అధికారులు ఒక వ్యాపారి వద్ద స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మాంసాన్ని డంపింగ్‌యార్డులో పాతి పెట్టగా… 9 కేజీలు, 8 కోళ్ల్లు మాత్రమే ఉన్నాయి. పూడ్చిపెట్టిన మాంసాన్ని సైతం కొందరు తవ్వి తీసుకుని వెళ్ళారు.

అదే విధంగా ఎన్టీఆర్‌ కాలనీ శివారు ప్రాంతంలోని ఒక ఇంట్లో దాచి పెట్టిన చేపలని సైతం అధికారులు స్వాధీనం చేసుకుని పూడ్చి పెట్టారు. వీటిని కూడా తవ్వి తీసుకుని వెళ్ళారు. నెల కిందటి చేపలను ఐస్‌లో భద్రపరిచి అమ్ముతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు… వీరిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటన ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news