తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవంలో భాగంగా తాజాగా రెండున్నర కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ పాదయాత్ర ప్రారంభంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టను దర్శించుకొని వలిగొండ మండలం సంగెం దగ్గర ఉన్న మూసీ నది వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని ఫొటో తీయబోయిన ఫొటో గ్రాఫర్ మూసీ నది ఒడ్డు వెంట కింద పడిపోయాడు. దీంతో వెంటనే అతన్ని బయటికీ లాగారు.
తొలుత సీఎం రేవంత్ రెడ్డి సంగెం వద్ద ఉన్న భీమలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మూసీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి స్పీడ్ బోట్ లో ప్రయాణించారు. అనంతరం సంకల్ప యాత్ర ప్రారంభించారు. సంగెం వద్ద భీమలింగం కత్వ వద్ద మూసీ నీటిని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. సంగెం నుంచి నాగిరెడ్డి పల్లి వరకు 2.5 కి.మీ మేరకు పాదయాత్ర చేశారు.