కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం : రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోయే ఎంపీ సీట్ల సంఖ్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు .మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 9 నుండి 13 ఎంపీ సీట్లు గెలుస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు.

అనుకున్న ఫలితాలు రాకపోతే.. ఇక నుండి మరో 2 గంటలు ఎక్కువ పని చేస్తానని ,కేంద్రంలోనూ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చెప్పారు. సెంట్రల్‌లో ఇండియా కూటమి పవర్‌లోకి రాగానే తెలంగాణకు 4 కేంద్రమంత్రి పదవులు అడుగుతామని తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేయగా.. ఇవాళ విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ముఖ్యమంత్రి మాటలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని మెజారిటీ సర్వేలు వెల్లడించాయి. కాగా, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అధికారిక ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news