తెలుగు రాష్ట్రాల ప్రజలకు లగడపాటి రాజగోపాల్ గురించి… లగడపాటి చేసే సర్వేల గురించి బాగా తెలుసు. ఆయన చేసే సర్వేలపై ప్రజలకు బాగా విశ్వాసం ఉండేది. అందుకే ఆయనకు ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు కూడా వచ్చింది. అయితే అదంతా గతం…ఎందుకంటే లగడపాటి సర్వేలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఊహించని విధంగా అటు తెలంగాణ, ఇటు ఏపీలో కూడా లగడపాటి సర్వేలు నిజం కాదని తేలింది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ ఓడిపోతుందని, కాంగ్రెస్-టిడిపి కూటమి గెలుస్తుందని తన సర్వేలో చెప్పారు.
అలాగే లగడపాటి కూడా ఇక సర్వేలు చేయనని చెప్పేశారు. మరి లగడపాటి సైడ్ అయ్యాక ఆ బాధ్యతలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈయన వైసీపీకి యాంటీగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ మధ్య రాజుగారు….కూడా తాను సర్వేలు చేయిస్తున్నాని, ఆ సర్వేల్లో జగన్ గ్రాఫ్ తగ్గిపోతుందని చెబుతున్నారు. అసలు తాను చేసిన సర్వేలో వైసీపీకి 50 సీట్లు కూడా రావని మొన్న ఆ మధ్య మాట్లాడారు.
ఇక తాజాగా రాజుగారు మరో తాను మరో సర్వే చేశానని చెప్పారు. తాను నిర్వహించిన ఒక సర్వేలో జగన్ పరిపాలనా గ్రాఫ్ 15 శాతం తగ్గినట్లు తేలిందన్నారు. అంటే రాజుగారు కూడా లగడపాటి మాదిరిగా సొంత సర్వేలు చేస్తున్నారు. అయితే ఇదంతా చంద్రబాబు మాయ అని అర్ధమవుతుంది. సర్వేల పేరిట ప్రజల మైండ్ మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.