టీఆర్‌ఎస్‌ కు బిగ్‌ రిలీఫ్‌ : పథకాల అమలుపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన !

-

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం… హుజురాబాద్ ఉప ఎన్నిక అక్టోబర్ 30 న ఉంటుందని… నవంబర్ 2 ఫలితాలు ఉంటాయన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్. కోవిడ్ ఇంకా ఉందని… కాబట్టి కోవిడ్ నిబంధనలు ఏవిధంగా తీసుకోవాలని అనేదానిపై సూచనలు చేశారన్నారు.
నామినేషన్ సంబంధించి ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని… నామినేషన్ సందర్భంగా మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు.

Huzurabad | హుజురాబాద్

ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని… స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్ కూడా కుదించారని తెలిపారు. నో రోడ్ షోలు, మోటార్ ర్యాలీలకు అనుమతి లేదని… ఇంటింటికీ ప్రచారంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆన్ గోయింగ్ ప్రభుత్వ పథకాలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. పోలింగ్ కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలని… వెహికిల్ లో కూడా పార్టీల నేతలు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు..

కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశామని… ప్రతి ఒక్కరు కేంద్ర ఎన్నికల నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. అధికారులకు కూడా సూచిస్తున్న కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని.. ఇవాల్టి నుండి మెడల్ కోడ్ ఉంటుందన్నారు.. హుజురాబాద్ నియోజకవర్గం రెండు జిల్లాలో ఉంటుందని… ఆ రెండు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని వెల్లడించారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కోవిడ్ పేషేంట్ లకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తామని…. ఓటర్లందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే వారు పోలింగ్ వారం ముందు వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version