ప్రతీకారం తీర్చుకునేందుకు రోడ్డు మార్గాన అన్ని కిలోమీటర్ల ప్రయాణం..చివరికి త్రిష ఏం చేసిందంటే?

-

సౌత్ స్మైలింగ్ క్వీన్ త్రిష లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఫిల్మ్ ‘ ద రోడ్’. అరుణ్ వసీగరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వెరీ డిఫరెంట్ స్టోరి లైన్ తో వస్తున్నది. బుధవారం హీరోయిన్ త్రిష బర్త్ డే సందర్భంగా మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

ట్విట్టర్ వేదికగా ‘ద రోడ్’ పిక్చర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. సదరు పోస్టర్ లో త్రిష బ్లాక్ కలర్ పంజాబీ డ్రెస్సులో డిఫరెంట్ లుక్ లో కనబడుతోంది. ‘‘ద రోడ్’’ ..‘రివెంజ్ ఇన్ 462 kms’ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ ఫిల్మ్..లో ప్రతీ కారం తీర్చుకునేందుకు త్రిష అన్ని కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుందని టాక్.

డ్యాన్సింగ్ రోస్ షబీర్, త్రిష ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, మూవీ వెరీ డిఫరెంట్ గా అండ్ ఎంగేజింగ్ గా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. త్రిష..నటించిన సినిమాలు కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ , ఇతర కారణాల వలన ఇంకా విడుదల కాలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news