మలేషియాలోని ఆ స్కూల్ ప్రతిరోజు గాంధీని గౌరవిస్తుంది..

-

మహాత్మా గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ గాంధీని పూజిస్తారు.. గౌరవిస్తారు.. ఆరాధిస్తారు. అందుకే ఆయన జాతి పిత అయ్యారు. మహాత్మ అయ్యారు. ఆయన జీవిత చరిత్ర, ఆయన స్వాతంత్ర్యోద్యమం… సత్యాగ్రహం… లాంటి వాటిని పాఠ్యాంశాల్లోనూ చేర్చారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. పిల్లలు కూడా ఆయన బాటలో నడవాలని కోరుకుంటారు.

ఈనేపథ్యంలో మలేషియాలోని ఓ స్కూల్ గాంధీజీని రోజూ స్మరించుకుంటుంది. గౌరవిస్తుంది… భక్తితో పూజిస్తుంది. విద్యార్థుల్లో ఆయన భావాలను నింపుతోంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ కు సమీపంలోని సుంగాయ్ సిపుట్ లో ఉన్న ఓ స్కూల్ లోనే బాపూజీని పూజిస్తున్నారు. ఆ స్కూల్ లోని ప్రేయర్ హాల్ లో గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. 1954 లోనే గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించింది స్కూల్ యాజమాన్యం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు ప్రేయర్ సమయంలో గాంధీజీని గుర్తు తెచ్చుకుంటారు. ఆయన సేవలను స్మరించుకుంటారు.

ఆ స్కూల్ కు ది మహాత్మా గాంధీ కలసలాయ్ అని పేరు పెట్టారు. 1950 లో బ్రిటీషర్ల పరిపాలనలో ఉన్న మలేషియా, భారత్ మధ్య బంధాన్ని ఆ స్కూల్ కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది. యూఎన్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఉన్న విజయ లక్ష్మి పండిట్.. ఆ స్కూల్ ను ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news