వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టుల పై వైసీపి లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపునకు పాల్పడుతోంది. దీనిపై హై కోర్టుకు వెళ్తే కోర్టులను కూడా ఈ ప్రభుత్వం తప్పుడు దారి పట్టిస్తోంది అని ఆయన అన్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తే బాధితులు ఆందరినీ వదిలేశామని ప్రభుత్వం చెప్పింది. కానీ కోర్టు కూడా ప్రభుత్వ వాదనలను నమ్మలేదు. పోలీసు స్టేషన్ల సీసీ కెమెరా పుటేజీని కోర్టు ముందు పెట్టమని ఆదేశించింది అని ఆయన తెలిపారు.
ఇప్పుడు కోర్టులే ప్రజలను కాపాడుతున్నాయి. తెలంగాణలో ఉన్న వారిపై కూడా కేసులు పెడుతున్న దుస్థితి ఏపీలో ఏర్పడింది. ఎప్పుడో చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారు. టీడీపీ వారు ఎవరి పేరు చెబితే పోలీసులు వారిపై కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల ఫోన్లను పరిశీలిస్తే వారిని ఎక్కడ నిర్బంధించిందీ తెలుస్తుంది అని మనోహర్ రెడ్డి అన్నారు.